“అహ్మదాబాద్‌లో మూడేళ్ల బాలిక గాలిపటంతో ఎగిరిపోయింది" అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్కులేట్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
"దేవుడికి కృతజ్ఞతలు, బాలిక క్షేమంగా కిందకు దిగింది... చాలా భయంగా ఉంది" మరి కొంతమంది నెటిజెన్లు ఇది అహ్మదాబాద్ లో జరిగిన వీడియోగా షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘సోషల్ మీడియా సోర్స్’ అంటూ 51 సెకండ్ల ఈ వీడియోని ట్విట్టర్ లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. వైరల్ అవుతున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సంఘటన అహ్మదాబాద్ లో జరిగిందంటూ అదే డిస్క్రిప్షన్ తో యూట్యూబ్ లో కూడా మరికొంతమంది పోస్ట్ చేశారు.
నిజ నిర్ధారణ
నిజంగానే మూడేళ్ల బాలిక గాలిపటంతో సహా అహ్మదాబాద్ లో ఎగిరిపోయిందా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీవర్డ్ సెర్చ్ తో పాటుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో ఈ సంఘటన August 30, 2020 రోజున తైవాన్ దేశానికి చెందిన Hsinchu అనే సిటీలో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ సందర్భంగా చోటు చేసుకుందని Associated Press ప్రచురించింది.
గాలిపటం చాలా పొడవుగా ఉండడంతో పాటుగా, అదే సమయంలో బలంగా గాలులు రావడమే ఈ సంఘటనకు కారణంగా స్థానిక మీడియా పేర్కొంది. గాలిపటం చివర మూడేళ్ల బాలిక మెడకు చుట్టుకోవడంతో గాలిపటంతో పాటుగా బాలిక కూడా గాలిలో పైకి ఎగిరిందని, అయితే దానిని గుర్తించిన నిర్వాహకులు 30 సెకండ్లలోనే బాలికను కిందికి దించారని గార్డియన్ పత్రిక పేర్కొంది.
బాలిక మెడకు గాలిపటం చుట్టుకోవడంతోపాటు, తను గాల్లో పైకి లేవడం వల్ల తనకు గాయాలయ్యాయని, దాన్ని గమనించిన నిర్వాహకులు వెంటనే రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించారని TODAY ఇదే వార్తను Aug 31, 2020 రోజున ప్రచురించింది.
సో 2020లో జరిగిన సంఘటనను ఇప్పుడు జరిగినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ సంఘటన తైవాన్ లో జరిగింది, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో కాదు.