No, This Indian Music Director Didn't Win Oscar Award
ఆస్కార్ అవార్డ్ సాధించిన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది. బెస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్ అఫ్ ది ఇయర్ అవార్డుకి తమిళ పాట ఎన్నిక అయిందనేది ఆ వైరల్ వార్త సారాంశం. సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని నీయే ఓలి అనే పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అరివు కు ఆస్కార్ అవార్డు వచ్చిందని సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని నీయే ఓలి పాటకు, తమిళ సంగీతకారుడు అరివు ఆస్కార్ అవార్డు సాధించారన్న వార్త ఇది.
నిజ నిర్ధారణ
నిజంగానే ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు సాధించారా? నీయే ఓలి పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అరివు కు ఆస్కార్ అవార్డు వచ్చిందా? తెలుసుకోవడానికి గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫాక్ట్ చెక్ టీం. దీంతో ట్విట్టర్లో సార్పట్ట పరంబరయ్ చిత్రంలో ఉన్న నీయే ఓలి పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ చేసిన ఒక ట్వీట్ కనిపించింది. జూనోస్ అవార్డులలో మ్యూజిక్ వీడియో ఆఫ్ ద ఇయర్ అవార్డుకి తమ పాట నామినేట్ అయిందనే విషయం ఇందులో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ట్వీట్ చేశారు.
ఇక దీంతోపాటుగా నీయే ఓలి సాంగ్ అని మరోసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబ్ లో పాటతో పాటుగా ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా కనిపించింది. ఈ పాటకి తమిళ భాషలో లిరిక్స్ ని అందించారు అరివు.
నీయే ఓలి పాటకు ఆస్కార్ వచ్చిందనే వార్త ఎక్కడా కనిపించకపోవడంతో మరొకసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూస్తే ఈ పాటకి సంబంధించిన వికీపీడియా పేజీ తో పాటుగా, అరివు పేజ్ కూడా కనిపించింది. ఇందులో గతంలో తాను చేసిన ఆల్బమ్ లిస్ట్ ఉంది తప్ప, ఎక్కడా ఆస్కార్ గురించిన వివరాలు లేవు.
https://en.wikipedia.org/wiki/Neeye_Oli
https://en.wikipedia.org/wiki/Arivu
అలాగే అరివు ట్విట్టర్ ఎకౌంటుని కూడా పరిశీలించి చూసినపుడు అందులో కూడా ఆస్కార్ వివరాలు లేవు.
మరోవైపు ఆస్కార్ అవార్డుల అధికారిక వెబ్ పేజిలో చూసినప్పుడు కూడా ఈ పాటకు సంబంధించిన వివరాలు లేవు.
సో, సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని 'నీయే ఓలి ' పాటకు తమిళ సంగీత కారుడు ఆస్కార్ సాధించారని అన్న వార్త నిజం కాదు.