జాతీయ జెండాతో టేబుల్ తుడిచిన సంఘటన జరిగింది అనంతపురంలో కాదు, ఒడిశాలో.

అనంతపూర్ డెప్యూటీ రిజిష్ట్రార్ జాతీయజెండాని ఎలా అగౌరవముతో అవమానిస్తున్నాడో చూడండి

By Nellutla Kavitha  Published on  24 Jan 2023 4:48 PM IST
జాతీయ జెండాతో టేబుల్ తుడిచిన సంఘటన జరిగింది అనంతపురంలో కాదు, ఒడిశాలో.

“అనంతపూర్ డెప్యూటీ రిజిష్ట్రార్ జాతీయజెండాని ఎలా అగౌరవముతో అవమానిస్తున్నాడో చూడండి" అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతుంది.

“రౌడీ రాజ్యంలో జాతీయ జెండాకు.... ప్రభుత్వ అధికారులు ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుంది" అంటూ జాతీయ జెండాతో టేబుల్ తుడుస్తున్న 25 సెకండ్ల అదే వీడియోను ట్విట్టర్లో మరొక నెటిజన్ పోస్ట్ చేశారు.

నిజనిర్ధారణ

నిజంగానే అనంతపూర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి జాతీయ జెండాను అవమానించారా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది. దీంతో ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగిందంటూ hmtv News ప్రసారం చేసిన వార్త కనిపించింది. సిమిలీ లోని ప్రశాంత్ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగి జాతీయ జెండాతో టేబుల్ ని తుడిచాడంటూ ఆ వార్త ప్రసారమైంది. కానీ అంతకుమించిన వివరాలేవీ అందులో లేవు.


దీంతో మరొకసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిందని, పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాతీయ జెండాను తన కార్యాలయం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడని Odisha Bytes News ట్విట్టర్లో పేర్కొంది.

పూరీలోని కోణార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిమిలి పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ స్వైన్ ఈ సంఘటనకు పాల్పడ్డాడని, జాతీయ జెండాను అవమానించినందుకు Prevention of Insult to National Honour Act, 1971 ప్రకారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని Times of India ప్రచురించింది.

అయితే అంతకుముందే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తను చేసిన తప్పుకు ప్రశాంత్ కుమార్ క్షమాపణ అడిగారు. https://odishatv.in/news/odisha/disrespect-to-national-flag-by-panchayat-executive-officer-in-odisha-arrested-194696

ఇక ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జరిగింది అంటూ సోషల్ మీడియాలో షేర్ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. ఈ సంఘటన ఒడిషాలో చోటు చేసుకుందని ఆంధ్రప్రదేశ్ లో జరిగిందంటూ తప్పుగా షేర్ చేస్తే చర్యలు తప్పవంటూ ట్విట్టర్లో పేర్కొంది.

సో. ఒడిషాలో పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాతీయ జెండాతో టేబుల్ తుడుస్తున్న దృశ్యాలను ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో జరిగినట్టుగా షేర్ చేస్తున్నారు.

Claim Review:wiping the table with the national flag happened in Anantapur
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story