భారతీయ టెలికాం మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది. అక్టోబర్ 1న దేశంలో 5G సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక వచ్చే ఏడాది డిసెంబర్ చివరి కల్లా దేశం మొత్తం మీద 5G సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా టెలికాం కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 3G, 4G స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టును చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
త్రీ జి, ఫోర్ జి స్మార్ట్ ఫోన్ లు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఫైవ్ జి ఫోన్ ల ఉత్పత్తికి అప్డేట్ కావాల్సిందిగా మూడు నెలల టైం లిమిట్ ఇచ్చినట్టుగా కూడా మరో వార్త కూడా సర్క్యులేట్ అయింది.
ఈ పోస్టును చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇందులో నిజం ఎంత?
నిజ నిర్దారణ
దీనిపై ఫ్యాక్ట చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా సర్కులేట్ అవుతున్న మెసేజ్ లు తప్పని తేలింది. త్రీ జి, ఫోర్ జి స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, అదంతా తప్పుడు సమాచారంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్లో పేర్కొంది.
కొన్నిమీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టుగా 3G, 4G స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదని PIB తెలిపింది.
సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లైమ్ తప్పు.