FactCheck : ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో, మూడు కళ్లతో సౌదీలో బాలుడు జన్మించలేదు

baby with three eyes is Digitally Edited Clip. సౌదిలో మూడు కన్నులతో బాలుడు జననం.... బ్రహ్మంగారి కాలజ్ఞానం... నిరూపించు దృశ్యం

By Nellutla Kavitha  Published on  21 Jan 2023 3:16 PM GMT
FactCheck : ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో, మూడు కళ్లతో సౌదీలో బాలుడు జన్మించలేదు

“సౌదిలో మూడు కన్నులతో బాలుడు జననం.... బ్రహ్మంగారి కాలజ్ఞానం... నిరూపించు దృశ్యం" అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతుంది.

ఇదే వీడియోను మరొక నిటిజన్ ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.
నిజ నిర్ధారణ:
నిజంగానే సౌదీలో మూడు కళ్ళతో ఒక బాలుడు జన్మించాడా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చేసింది. దీంతో గతంలోనూ ఇదే వీడియో వైరల్ గా సర్క్యులేట్ అయినట్టుగా అర్థమైంది. ఇదే వీడియోను July 10, 2020 లో కూడా "పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పిన విధంగా విదేశంలో వింతశిశువు జననం..ముచ్చటగా మూడుకన్నులతో మూర్తీభవించిన త్రినేత్రుడు...జై శ్రీమన్నారాయణ" అంటూ ఫేస్బుక్లో ఒక నెటిజన్ పోస్ట్ చేశారు.
కొంతమంది నెటిజెన్లు ఆ బేబీ జర్మనీలో జన్మించింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియోను నిశితంగా గమనించినప్పుడు అది డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో గా అర్థమవుతుంది. వీడియోలో కనిపిస్తున్న బేబీ ఎడమ కంటిని పోలినట్టుగానే, నుదుటిమీద ఉన్న కన్ను కూడా ఉంది. బేబీ ఎడమ కన్నును ఏ డైరెక్షన్ లో తిప్పినా, ఎటువైపు చూసినా నుదుటి మీద ఉన్న మూడవ కన్ను కూడా అలాగే తిరగడం గమనించవచ్చు. దీంతో ఇది డిజిటల్ గా ఎడిట్ చేసినట్టుగా అర్థమవుతుంది.

ఇక డిజిటల్ టెక్నాలజీతో మూడవ కంటిని ఎలా సృష్టించవచ్చో కొంతమంది నిపుణులు చేసి చూపించారు. ఆ వీడియోలను ఇక్కడ చూడవచ్చు.

అమెరికాలో కూడా ఒక అమ్మాయి మూడు కళ్ళతో పుట్టింది అంటూ ఒక వీడియోని ఓ ఔత్సాహకుడు ఒకరు ఎడిటెడ్ వీడియోగా చేసి చూపించారు.

Three-eyed humans appear అంటూ July 9, 2020 రోజున చైనా భాషలో కూడా ఒక ట్వీట్ కనిపించింది.
ఇక అదే రోజు డైనోసార్లు అంతరించలేదు అంటూ మరొక
ట్వీట్
కూడా చేశారు అదే యూజర్.
అంటే ఈ రెండు వీడియోలు నిజం కాదు. వీటిని డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియోలుగా అర్థం చేసుకోవచ్చు.
ఇక వైద్య పరిభాషలో ముఖం భాగంలో మరొక కన్ను, ముక్కు, చెవి లేదా పెదవులు రావడానికి “Craniofacial Duplication”గా అభివర్ణిస్తారు ఇది అతి అరుదుగా జన్యు సంబంధిత లోపాల వల్ల జరుగుతుంది. ఇలాంటి ఒక సంఘటన నైజీరియాలో జరిగినట్టుగా West Journal Of Radiology ప్రచురించింది. 2018 వ సంవత్సరంలో జన్మించిన ఒక బాలుడి తల అసాధారణంగా ఉండడంతో పాటుగా మూడవ కన్ను తలకు ఎడమ భాగంలో ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ లో ఉంది.
అయితే సౌదీ అరేబియాలో మూడు కళ్ళతో ఒక బేబీ పుట్టినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి మెడికల్ జర్నల్స్ ఆర్టికల్స్ ప్రచురించలేదు.
సో, సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో అవాస్తవం. డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియోనే జర్మనీలో, సౌదీ అరేబియాలో మూడు కళ్ళతో జన్మించిన బాలుడు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


Claim Review:ఇది డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో, మూడు కళ్లతో సౌదీలో బాలుడు జన్మించలేదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story