2016 వీడియోని కె. జె. ఏసుదాస్ 83 వ జన్మదినం రోజు హిందూ మతంలోకి మారిన వీడియోగా షేర్ చేస్తున్నారు

సుప్రసిద్ధ గాయకుడు జేసుదాసు క్రైస్తవం స్వీకరించి యేసుదాసుగా మారిన తరువాత హైందవ ధర్మం విలువ తెలుసుకోని తిరిగి హిందుమతంలోకి చేరి జేసుదాసు గా 83 వ పుట్టినరోజు నేడు అయ్యప్ప స్వామి సన్నిధిలో శరణం అయ్యప్ప అని వేడుకున్న అద్భుతమైన ద్రుశ్యం

By Nellutla Kavitha  Published on  23 Jan 2023 7:00 AM GMT
2016 వీడియోని కె. జె. ఏసుదాస్ 83 వ జన్మదినం రోజు హిందూ మతంలోకి మారిన వీడియోగా షేర్ చేస్తున్నారు

“సుప్రసిద్ధ గాయకుడు జేసుదాసు క్రైస్తవం స్వీకరించి యేసుదాసుగా మారిన తరువాత హైందవ ధర్మం విలువ తెలుసుకోని తిరిగి హిందుమతంలోకి చేరి జేసుదాసు గా 83 వ పుట్టినరోజు నేడు అయ్యప్ప స్వామి సన్నిధిలో శరణం అయ్యప్ప అని వేడుకున్న అద్భుతమైన ద్రుశ్యం" అని ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది.

దీనితో పాటుగానే "బానిస మతం నుండి బయటపడ్డ యేసుదాసు" అంటూ మరొక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

నిజ నిర్ధారణ

నిజంగానే సింగర్ కె.జె. ఏసుదాస్ హిందూ మతం స్వీకరించారా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీ వర్డ్ సెర్చ్ తో పాటుగా కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసి చూసింది. ఆయన హిందూ మతంలోకి ఏమైనా మారారా? అనే వార్త తెలుసుకోవడానికి మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాము అయితే ఇలాంటి సమాచారం లభించలేదు. కానీ ఇదే వీడియోను ట్విట్టర్ లో కూడా కొంతమంది నెటిజన్లు షేర్ చేస్తున్నట్టుగా అర్థమైంది. సింగర్ కె. జె. ఏసుదాస్ తన 83వ పుట్టినరోజున శబరిమల దేవస్థానంలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తున్నారని ఇదే వీడియోని పోస్ట్ చేశారు.

జనవరి 10న కె. జె. ఏసుదాస్ తన 83వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే ఆరోజు ఏసుదాస్ భారత దేశంలోనే లేరు. గత మూడేళ్లుగా అమెరికాలోని డల్లాస్ లో నివసిస్తున్నారు కె. జె. ఏసుదాస్. కొచ్చిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ లో వర్చువల్ గా, డల్లాస్ నుంచి ఏసుదాస్ తో పాటుగా ఆయన సతీమణి ప్రభ ఏసుదాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మలయాళ నటులు మమ్ముట్టితో సహా ఇతర అభిమానులు Azeezia Convention Centre, Padivattom, కొచ్చి నుంచి ఏసుదాసుతో వర్చువల్ గా ముచ్చటించారు. ఈ వార్తను ఫోటోతో సహా హిందూ ప్రచురించింది.
ఇక గత 40 ఏళ్లుగా తన జన్మదినం రోజున కొల్లూరులో ఉన్న మూకాంబిక అమ్మవారి ఆలయంలో, అమ్మవారి సంకీర్తనలు తప్పనిసరిగా ఏసుదాస్ చేసేవారని, అయితే కరోనా కారణంగా గత మూడేళ్లుగా అమెరికాలోని డల్లాస్ లో ఏసుదాస్ నివసిస్తున్నందున, ఈసారి కూడా జన్మదిన వేడుకలలో భాగంగా కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయానికి ఏసుదాస్ హాజరు కావడం లేదని సోషల్ న్యూస్ జనవరి 10న వార్తను ప్రచురించింది.
ఇక సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియో 2016 నాటిది. పద్మభూషణ్ డాక్టర్ కె. జె. ఏసుదాస్ శబరిమల అయ్యప్ప దేవస్థానంలో, హరివరాసనం పాటను సెప్టెంబర్ 21న పాడారని, అక్టోబర్ 16 2016న అదే వీడియోను మలేషియా అయ్యప్ప సేవా సంఘం ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది.

మరోవైపు వైరల్ వీడియోలోసింగర్ కె. జె. ఏసుదాస్ తో పాటుగా కనిపించిన వ్యక్తి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రయర్ గోపాలకృష్ణన్ జూన్ 4, 2022 న మరణించిన వార్తను ఇక్కడ చూడవచ్చు.
https://keralakaumudi.com/en/news/news.php?id=829598&u=former-mla-and-devaswom-board-president-prayar-gopalakrishnan-passes-away-౮౨౯౫౯౮


సింగర్ ఏసుదాస్ లాటిన్ క్యాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలోనే జనవరి 10 1940లో జన్మించారు, వారి అమ్మ Elizabeth Joseph, నాన్న Augustine Joseph . https://en.wikipedia.org/wiki/K._J._Yesudas
ఇక గతంలో కూడా కె. జె. ఏసుదాస్ హిందూమతంలోకి మారారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి.

అయితే వాటన్నిటిని ఆయన సతీమణి ప్రభాయేసుదాస్ ఖండించారు.
https://newsable.asianetnews.com/south/yesudas-converted-to-hinduism
చివరగా సింగర్ కేజే ఏసుదాస్ హిందూమతంలోకి మారలేదు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియో కూడా ఇప్పటిది కాదు. ఆయన తన 83వ జన్మదినం రోజు అమెరికాలోనే ఉన్నారు. 2016 నాటి వీడియోను 83వ జన్మదినం రోజు శబరిమల దేవస్థానంలో ఉన్నారని చెబుతూ పాత వీడియో షేర్ చేస్తున్నారు.

Claim Review:Video of K. J. Yesudas converting to Hinduism on his 83rd birthday
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story