నిజ నిర్ధారణ : వైట్ ఐల్యాండ్ లో అగ్నిపర్వత విస్ఫోటనం వైరల్ వీడియో నిజమేనా ?

By రాణి  Published on  23 Dec 2019 12:41 PM GMT
నిజ నిర్ధారణ : వైట్ ఐల్యాండ్ లో అగ్నిపర్వత విస్ఫోటనం వైరల్ వీడియో నిజమేనా ?

డిసెంబర్ 9న న్యూజిలాండ్ లోని వైట్ ఐల్యాండ్ అనే ఒక ఐల్యాండ్ లో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. అందులో సుమారు 19 మంది మరణించారు. వకారి లేదా వైట్ ఐల్యాండ్ లో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన సమయానికి 47 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. డజన్ మందికి పైగా పర్యాటకులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

ఈ ఘటన తరువాత, న్యూజిలాండ్ వైట్ ఐల్యాండ్ అగ్నిపర్వత విస్ఫోటనం అంటూ వాట్సాప్ లో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. ఈ వీడియో లో నీటిలో విస్ఫోటనం జరగడం, దట్టమైన నల్లని మబ్బులు కమ్ముకోవడం, నీటిలో అలజడి వల్ల నీరు పైకి లేచి నగరాన్నంతా ముంచెయ్యడం మనం చూడవచ్చు.

నిజ నిర్ధారణ : వీడియో నుంచి కొన్ని ఫ్రేం లను తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, 2017 నాటి ఫలితాలు లభించాయి.

Fact Check 1

Fact Check 1

నీటి కింద విస్ఫోటనం చూపే ఈ వీడియో మానవ మేధ సృష్టి. ఆక్ ల్యాండ్ మ్యూజియం కోసం ప్రొఫెసర్ కోలిన్ విల్సన్ అనే ప్రముఖ పరిశోధకుడు తయారు చేసినది. ఒకవేళ సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగితే, పక్కన ఉన్న నగరానికి ఎంత హాని చేస్తుంది అనే అంశం పై ఈ వీడియో ను తయారు చేశారు.

https://www.iflscience.com/environment/watch-the-terrifying-moment-a-volcanic-eruption-hits-a-major-city/

అత్యుత్తమ సాంకేతికతను వాడి కళ్లకు కట్టినట్టుగా ఈ వీడియోను సృష్టించారు. వొల్కనో, వైట్ ఐల్యాండ్, న్యూజిలాండ్ అనే ముఖ్యమైన పదాలను ఉపయోగించి సెర్చ్ చేయగా, వైట్ ఐల్యాండ్, న్యూజిలాండ్ లో సంభవించిన విస్ఫోటనం భుమిపైన జరిగినదే తప్ప, నీటిలో జరిగింది కాదని నిర్ధారించవచ్చు.

Fact Check 1

గార్డియన్ అనే ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక యూట్యూబ్ లో ప్రచురించబడిన వార్త:

ఈ వీడియో న్యూజిలాండ్ లోని వైట్ ఐల్యాండ్ లో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించింది అనే వార్త అబద్ధం. ఆక్ ల్యాండ్ మ్యూజియం కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన మానవ మేధతో సృష్టించబడిన సిములేషన్ వీడియో ఇది.

Next Story
Share it