లాక్ డౌన్ సమయాల్లో ఇప్పటికే చాలా వస్తువులు దొరకడం లేదు. దుకాణాలు కూడా ఓ సమయం వరకే తెరుస్తూ ఉన్నారు. స్థానికంగా కూరగాయలు అమ్మే వాళ్ళే ఈ సమయంలో ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు. ఎక్కువ మంది గూమికూడకుండా స్థానికంగానే కూరగాయలు దొరికేలా చేస్తున్నారు. కానీ కొన్ని ఫేక్ న్యూస్ కారణంగా ప్రజలు అయోమయానికి గురవుతూ ఉన్నారు.

బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ ఓ ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో అది కాస్తా వైరల్ అవుతోంది.

कुत्ते पन की हद देखो। थूकने से नफरत नहीं बढ़ती, सब्जी नहीं खरीदने से बढ़ती है।

Nilima Satish ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಗುರುವಾರ, ಏಪ್ರಿಲ್ 16, 2020

ఆ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లో ఏముందటే..
“It is not necessary that all those Muslims spitting on fruits and vegetables while selling them are coronavirus positive. Even then few Hindu costumers are boycotting Muslim sellers and are spreading hatred. Why are they so intolerant?”

‘ఉమ్మివేస్తూ పండ్లు, కూరగాయలు అమ్ముతున్న ముస్లింలు అంతా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళే కాదని.. కొందరు హిందూ కొనుగోలుదారులు ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని.. ఎందుకు ఇంత అసహనం’ అని ఆ ట్వీట్ లో ఉంది.

కొందరు ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. జావేద్ జాఫ్రీని తిట్టారు కూడా..!

నిజమెంత:

హిందువులు విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ‘పచ్చి అబద్ధం’.

జావేద్ జాఫ్రీ చేసిన ట్వీట్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఆయన అకౌంట్ లో కూడా ఆ ట్వీట్ కనపడలేదు. ఆ ఫోటోను కావాలనే కొందరు ఎడిట్ చేసి.. ఆయనపై బురదజల్లాలని చూసిన వారి పని అని పక్కాగా అర్థం అవుతుంది.

జావేద్ జాఫ్రీ కూడా ఈ ట్వీట్ పై తన క్లారిఫికేషన్ ఇచ్చారు. తాను ట్వీట్ చేశానని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోగ్రాఫ్ మొత్తం ఫేక్ అని ఆయన తేల్చేశారు. తన మీద పనిగట్టుకునే కొందరు ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నా ట్వీట్స్, స్పీచ్ లు అందరూ కలిసుండాలని, మత సామరస్యంతో కూడుకునేలా ఉంటాయని అన్నారు. ఇలాంటి సమయాల్లో మనుషులంతా కలిసికట్టుగా పోరాడాలని.. అప్పుడే మానవత్వం అన్నది తెలుస్తుందని ఆయన తెలిపారు.

జావేద్ జాఫ్రీ చేసిన ట్వీట్ అంటూ వైరల్ అవుతున్న ఫోటో.. ‘పచ్చి అబద్ధం’

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.