స్పైడర్ మ్యాన్ గా మోడి... ఈ కార్టూన్ నిజంగా యురోపియన్ పత్రికలో ప్రచురించబడిందా??

By రాణి  Published on  28 Dec 2019 10:37 AM GMT
స్పైడర్ మ్యాన్ గా మోడి... ఈ కార్టూన్ నిజంగా యురోపియన్ పత్రికలో ప్రచురించబడిందా??

కొన్ని రోజులుగా, ఒక కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిండా జనంతో దూసుకువస్తున్న బస్సును స్పైడర్ మాన్ రెండు చేతులతో ఆపే ప్రయత్నం చేస్తూ, రోడ్డు పై వెళ్తున్న పిల్లవాడిని కాపాడుతున్నట్టు ఉండే ఈ కార్టూన్ యూరోపియన్ పత్రికలో వెలువడిందంటూ వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

పిల్లవాడు భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు, స్పైడర్ మ్యాన్ మోడి అని, బస్సు కాంగ్రెస్ కాగా, మమతా బెనర్జీ, ఐసిస్, ఖజకిస్తాన్, రోహింగ్యా, బాంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్... వీరందరూ బస్సులో ప్రయాణిస్తున్న వారుగా ఈ కార్టూన్ లో చూపారు.

సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ తరువాత ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్ లలో ఎందరో, యూరోపియన్ పత్రికలో ప్రచురించబడిన కార్టూన్ గా దీనిని షేర్ చేశారు.

Fact Check

నిజ నిర్ధారణ:

అంతర్జాతీయ వార్తా మాధ్యామాలలో వెతకగా, ఈ కార్టూన్ ఎటువంటి యురోపియన్ పత్రికలో ప్రచురితం కాలేదని తెలుస్తోంది. స్పైడర్ మ్యాన్ స్టాపింగ్ బస్ అనే ముఖ్యమైన పదాలను వాడుతూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి చూస్తే, వేరువేరు క్యాప్షన్ లతో అదే చిత్రాన్ని పంచుకోవడం ఫలితాలలో మనం చూడవచ్చు.

spidey.jpg

మేమేలు తయారుచేసే వెబ్ సైట్ లలో ఈ చిత్రం ఉండడం విశేషం. ఈ వెబ్ సైట్లను ఉపయోగించి చిత్రం పై మనకు నచ్చిన మాటలను చేర్చి సరదాగా సోషల్ మీడియోలో పంచుకోవచ్చు.

https://imgflip.com/memetemplate/167126612/Spidey-Stopping-Bus

చివరగా, మమత బెనర్జీ పేరు కూడా ఆంగ్లంలో తప్పుగా ప్రచురితం అయ్యింది. యురోపియన్ పత్రికలో ఈ కార్టూన్ ప్రచురితం అయ్యిందనే ప్రచారం తప్పు. ఇది అంతర్జాలంలో మేమేలు తయారుచేసే వెబ్ సైట్ల నుంచి తీసుకుని తయారు చేయబడిన చిత్రం.

Next Story
Share it