ఫేస్ బుక్ లో ‘మన ఆరోగ్యం’ !!
By సత్య ప్రియ Published on 30 Oct 2019 11:23 AM GMTఇకపై ఫేస్ బుక్ మీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ తీసుకోబోతోంది. ప్రివెంటివ్ హేల్త్ (Preventive health) అనే ఒక కొత్త టూల్ ని ప్రవేశబెట్టబోతోంది. మీరు ఎప్పుడు బిపి చెక్ చేసుకోవాలో, కొలెస్ట్రాల్ పరిక్ష ఎప్పుడు చేసుకోవాలో ఇకముందు ఫేస్ బుక్ మీకు చెప్పనుంది.
పేరు ను బట్టి, ఈ కొత్త టూల్ మీరు అనారోగ్యం పాలు కాకుండా ఉండేటట్టు చూస్తుంది. నియమిత సమయాలలో స్కానులు, ఆరోగ్య పరిక్షలూ చేసుకునేటట్టు ప్రోత్సహిస్తుంది.
వయస్సు, లింగాన్ని బట్టి క్యాన్సర్, గుండె సమస్యలు రాకుండా ఉండేటట్టు పరిక్షలు చేయించుకోమని ముందుచూపుతో మనకి సలహాలు ఇస్తుంది ఈ టూల్. పరిక్ష కు ఏది అణువైన సమయమో అదే మనకు చెప్తుంది, పరీక్ష తరువాత మళ్లీ ఎప్పుడు పరిక్ష కు వెళ్లాలో ముందే నోట్ చేస్తుంది, మనల్ని అలెర్ట్ చేస్తుంది.
అయితే, మన ఆరోగ్యం గురించి అందరూ తెలుకోవడం కొందరికి ఇష్టం వుండదు. అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. మరి, ఇలాంటప్పుడు మన పరిక్షలూ, వాటి తాలూకూ ఫలితాలూ యాప్ లో నమోదయ్యి ఇతరులకు తెలిస్తే కష్టమవుతుంది. మరి అది లీక్ అవుతే ఎలా అనే ఆలోచన రావొచ్చు.
అందుకే, ఫేస్ బుక్ ముందుగానే ఈ టూల్ నుంచి ఎటువంటి సమాచారం లీక్ అవ్వదని హామీ ఇచ్చింది. ఈ సమాచారాన్ని తీసుకొని యాడ్లు ప్రసారం చేయడం వంటివి కూడా జరగవని చెప్తోంది. మరి ఈ టూల్ ఎంతవరకూ విజయం సాధిస్తుందో చూడాలి