ఫేస్‌ ఫీల్డ్‌ల తయారీకి ముందుకొచ్చిన మహీంద్రా కంపెనీ

By సుభాష్  Published on  29 March 2020 5:26 PM IST
ఫేస్‌ ఫీల్డ్‌ల తయారీకి ముందుకొచ్చిన మహీంద్రా కంపెనీ

మహీంద్రా.. దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ. తాజాగా ఫేస్‌ షీల్డ్‌లను తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మెడికల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఇవి అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 30న వీటిని తయారు చేస్తామని తెలియజేసింది. ముందుగా రోజుకు 500 యూనిట్లను తయారు చేస్తామని, తర్వాత తయారీని మరింత పెంచుకుంటూ వెళ్తామని తెలిపింది.

ఫోర్డ్‌ కంపెనీ నుంచి ఫేస్‌ షీల్డ్‌ డిజైన్‌ తీసుకున్నామని మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మెడికల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వీటిని ఉపయోగించుకోవచ్చు. సోమవారం నుంచి రోజుకు 500 యూనిట్లను తయారు చేస్తామని ట్వీట్ చేశారు.

ఈ కంపెనీ కేవలం ఫేస్‌ ఫీల్డ్‌లను మాత్రమే కాకుండా వెంటిలేటర్లను సైతం తయారు చేయనుంది. ఇప్పటికే వెంటిలేటర్ల తయారీకి సంబంధించి నమూనాను కూడా సిద్ధం అయింది. ఆనంద్‌ మహీంద్రా ఇప్పటికే వెంటిలేటర్ల తయారీ అంశాన్ని ఇటీవల ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

కరోనాతో బాధపడుతున్న వారు ఉపయోగించుకోవచ్చు..

కరోనాతో బాధపడుతున్న వారు ఈ వెంటిలేటర్లను ఉపయోగించుకున్నారు. ఇవి చాలా తెలికగా ఉంటాయి. అందులో చాలా ఫీచర్లు ఉండవచ్చని అంచనాలున్నాయి. వీటి రూపకల్పనకు కంపెనీ ఇంజనీరింగ్‌ బృందంకు కేవలం 2 నుంచి 3 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం.



Next Story