జర్నలిజంలోకి ఫేస్ బుక్...!!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 5:32 PM GMT
జర్నలిజంలోకి ఫేస్ బుక్...!!!

న్యూయార్క్‌ : ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.ఫేస్ యాప్‌లో 'న్యూస్ ట్యాబ్ 'పేరుతో వార్త విభాగాన్ని తీసుకొచ్చింది. దీంతో... తన ప్లాట్‌ఫాంలో ఫేక్‌న్యూస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. కొంతకాలంగా ప్రయోగదశలో పరిశీలించిన ఈ ఫీచర్‌ను శుక్రవారం అమెరికాలో మాత్రమే అందుబాటుకి తెచ్చారు. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్‌లో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ మాట్టాడారు. తొలిసారిగా తమ యాప్‌లో ప్రదర్శించే వార్తలకుగాను పబ్లిషింగ్ కంపెనీలకు కొంత సొమ్మును చెల్లించనున్నామని తెలిపారు. అయితే.. ఫేస్‌బుక్‌లో తమ వార్తలకోసం ఆయా పబ్లిషర్లు యాప్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి వుంటుందని జూకర్ బర్గ్ చెప్పారు.

ఈ విభాగంలో ప్రధానంగా వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఎన్‌బీసీ న్యూస్ , ఏబీసీ న్యూస్ తోపాటు, చికాగో ట్రిబ్యూన్ డల్లాస్ మార్నింగ్ న్యూస్ స్థానిక అవుట్లెట్లతో సహా ఉంటాయి. సుమారు 200 మంది ప్రచురణకర్తల వార్తలు, విశేషాలు ఫేస్‌బుక్‌లో చదువు కోవచ్చు. ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి చాలా కష్టపడ్డామన్నారు ఫేస్‌బుక్‌ వార్తా భాగస్వామ్యాన్ని పర్యవేక్షించే కాంప్‌బెల్ బ్రౌన్ .జర్నలిజానికి మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇస్తున్న గౌరవం గొప్పదని పలు వార్తా పత్రికల అధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story