టస్మానియా టైగర్ కనిపించిందోచ్...!!
By సత్య ప్రియ Published on 28 Oct 2019 12:51 PM GMTటాస్మానియన్ టైగర్, ఆస్ట్రేలియా కు చెందిన అరుదైన జంతువు. అధికారికంగా, దీనిని థైలసిన్ అని అంటారు. ఈ జంతువు టాస్మానియన్ టైగర్ అని పిలువబడినా అసలు పులుల జాతికి చెందినది కాదు. పిల్లి, నక్క, తోడేలులను కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ జంతువు.
తోడేలు జాతికి చెందినది. దీనికి పసుపు గోధుమ రంగుల బొచ్చు, పదునైన దవడలూ, తన పిల్లలని రక్షించుకోవడానికి కంగారూ లాగా ఒక సంచీ లాంటిదీ ఉన్నాయి.
అయితే, 1936లో ఈ జంతువు అంతరించిందని అందరూ అనుకున్నారు. మానవ నిర్బంధంలో పెరుగుతున్న టాస్మానియన్ టైగర్ ఆఖరి సంతతి 1936లో చనిపోయింది. అదే ఆ జాతి చివర అని భావించిన తరుణంలో గత 80 ఏళ్లలో 8 సార్లు దీనిని చూడడం జరిగింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం సుమారు రెండు నెలల క్రితం అడవిలో దీనిని గమనించారు. మూడేళ్ల క్రితం పశ్చిమ ఆస్ట్రేలియా కి చెందిన ఓ జంట ఫిబ్రవరీలో టాస్మానియలో పర్యటిస్తుండగా టాస్మానియన్ టైగర్ ను రోడ్డు దాటుతుండగా చూశారట. 8 ఉదంతాలలో ఇది ఒకటి.
అదే నెలలో "పిల్లి లాంటి జంతువు" కనిపించినట్టుగా సి ఎన్ ఎన్ కథనం ప్రచురించింది. ఇటీవల, జూలైలో, దక్షిణ టాస్మానియా లో టాస్మానియం టైగర్ పాదముద్రలు గుర్తించారు.
ఆస్ట్రేలియా మ్యూజియం ప్రకారం, టాస్మానియా, ఆస్ట్రేలియా కి చెందిన టాస్మేనియన్ టైగర్, థైలసినిడే కుటుంబానికి చెందినది.