కృష్ణా జిల్లాలో పేలుడు.. తండ్రీకొడుకులు మృతి

By సుభాష్  Published on  3 Sep 2020 5:16 PM GMT
కృష్ణా జిల్లాలో పేలుడు.. తండ్రీకొడుకులు మృతి

కృష్ణా జిల్లాలో పేలుడు జరిగింది. గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ఫ్లైవుడ్‌ కంపెనీలో ఖాళీ కెమెకల్‌ డబ్బాలు పేలడంతో తండ్రీ కొడుకులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జయరాజ్‌ ఫ్లైవుడ్‌ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుక్కు కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు తమ ఆటోలోకి ఖాళీ కెమికల్‌ డబ్బాలను ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతదేహాలు కొంత దూరం ఎగిరిపడ్డాయి. తండ్రీ కొడుకులు మృతి చెందడంతో అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు విజయవాడ రూరల్‌లోని కండ్రిక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు

Next Story
Share it