'24 గంటల జనతా కర్ఫ్యూ' నుంచి మినహాయింపు వీటికే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2020 2:30 PM GMT
24 గంటల జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు వీటికే..

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూను 24 గంటల పాటు పాటించి దేశానికి ఆదర్శంగా నిలవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాఠశాలలు, థియేటర్లు, పార్కులు వంటివి మార్చి 31 వరకు మూసివేయగా.. రేపు బస్సులు, మద్యం షాపులు మెట్రో రైళ్ల సర్వీసులు బంద్‌ కానున్నాయి.

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ కొనసాగనుంది. 24గంటల పాటు ప్రజలంతా తమ తమ ఇళ్లలో ఉండనున్నారు. ఇదిలా ఉండగా.. రేపటి బంద్ నుంచి కొన్నింటికి మినహాయింపు నిచ్చారు. పెట్రోల్‌ బంక్‌లు, పాల డిపోలు, మీడియా, ఔషద, కూరగాయల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. అత్యవసరాల కోసం ప్రతి ఆర్టీసీ డిపోలో 5 బస్సులు, 5 మెట్రో రైళ్లు కూడా సిద్దం ఉండనున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో రోగి నుంచి మరొకరికా సోకిన కరోనా మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.

Next Story