హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ‘ఛలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో కార్మిక నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. అయినప్పటికి కార్మికులు పోలీసులు ఏర్పాటు చేసిన వలయాలను చేధించుకొని ట్యాంక్‌ బండ్‌ మీదకు దూసుకొచ్చారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల తోపులాట జరిగింది. పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో మధ్యాహ్‌నం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ 170 మందిని అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించామని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. మరోవైపు జేఏసీ కో కన్వీనర్‌ కె.రాజిరెడ్డిని గుర్తుతెలియని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.