మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తీవ్ర అస్వస్థత

By సుభాష్  Published on  19 Jun 2020 2:26 AM GMT
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తీవ్ర అస్వస్థత

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్ ‌స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాయపాటి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు హైదరాబాద్‌లో ఉన్న రాయపాటి.. అనారోగ్యానికి గురయ్యారు.

కాగా, బ్యాంకుల రుణాల ఎగవేత కేసులు రాయపాటిని సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్నరాయపాటికి చెందిన ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఆసరాగా చేసుకుని ఆయనను బెదిరించి డబ్బులు దోచుకోవాలని చూసిన వ్యవహారంలో కేసు చిక్కుముడి వీడుతోంది.

Next Story