జయేష్ రంజన్ నామినేషన్ వేశాడు కాబట్టే నేను రంగంలోకి దిగా : మాజీ ఎంపీ జితేందర్

By రాణి  Published on  3 Feb 2020 1:02 PM GMT
జయేష్ రంజన్ నామినేషన్ వేశాడు కాబట్టే నేను రంగంలోకి దిగా : మాజీ ఎంపీ జితేందర్

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలపై స్పందించారు. ఒకసారి అధ్యక్షుడిగా పనిచేశాను..మరోసారి ఆ పదవి మీద నాకు ఆసక్తి లేదు కానీ..జయేష్ రంజన్ నామినేషన్ వేసిన కారణంగానే తాను కూడా రంగంలోకి దిగినట్లు తెలిపారు. కాగా..జయేష్ రంజన్ తన నామినేషన్ ను తిరస్కరణపై కారణాలు చెప్పలేదనడం పచ్చి అబద్ధమన్నారు. నామినేషన్ ను ఎందుకు తిరస్కరించారో రిటర్నింగ్ అధికారి మెయిల్ రూపంలో చెప్తారని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఏదొ ఒక అసోసియేషన్ లో ఈసీ సభ్యుడై ఉండాలి కానీ..జయేష్ రంజన్ ఏ స్పోర్ట్స్ అసోసియేషన్ లోనూ మెంబర్ కాదని తెలిపారు. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ను ఒక ఏడాది నడపాలంటే సుమారు రూ.30 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత ఖర్చు పెట్టి నడిపేంత బాధ్యత జయేష్ రంజన్ కు ఉందా అని ప్రశ్నించారు.

Next Story
Share it