దొంగలను నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు : దేవినేని
By రాణి Published on 30 Dec 2019 2:47 PM ISTవిజయవాడ : దొంగలను నమ్మి అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధానిపై వైసీపీ నిర్ణయాలను తప్పుబట్టారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని దేవినేని విమర్శించారు. జగన్ కనుసన్నల్లో నడుస్తున్న పోలీసులు, ఉన్నతాధికారులు ఆయన మాటలు విని సంతకాలు పెడితే వెళ్లేది జైలుకేనన్నారు.
గతంలో వైఎస్ ని ఇలాగే నమ్మిన కొందరు సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారని గుర్తు చేశారు. 16 నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన వ్యక్తులు..మళ్లీ జైలుకే వెళ్తారని విమర్శించారు. సీఎం చుట్టూ భజన చేసే 10 మంది మంత్రులతో ఆయనొక చెత్త కమిటీని వేసుకున్నారని విమర్శించారు దేవినేని. రాజధానిని తరలించే హక్కు జగన్ అండ్ బ్యాచ్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.