ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్ట్ ధర రూ. 2200: మంత్రి ఈటల
By సుభాష్ Published on 15 Jun 2020 12:55 PM ISTతెలంగాణలోకరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో కరోనా కేసులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. ప్రవేవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు చేయించుకుంటే రూ.2200 ధర నిర్ణయించామని అన్నారు. అలాగే వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ.7,500గా నిర్ణయించామని, వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తే రోజుకు రూ. 9వేలు నిర్ణయించామని పేర్కొన్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక లాక్‌డౌన్ ఎత్తివేశాక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
హైదరాబాద్‌లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తున్నామని వివరించారు. ఇక కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్‌లో ఉండాలన్నారు.