'కథ' నడిచింది దేవికారాణి పేషీ నుంచే...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 12:43 PM GMT
కథ నడిచింది దేవికారాణి పేషీ నుంచే...!

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా ఈఎస్‌ఐ కుంభకోణం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో ప్రధాన పాత్రధారి, సూత్రధారి దేవికారాణినే అని ఏసీబీ అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. కుంభకోణం మొత్తం ఆమె పేషీ నుంచే నడిచినట్లు చెబుతున్నారు. 286 ఆర్డర్స్‌ను దేవికారాణి పేషీ అధికారులు తారుమారు చేశారు. రికార్డ్స్‌ను తారుమారు చేసింది సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్ అని అధికారులు చెబుతున్నారు. డిస్పెన్సరీ నుంచి వచ్చిన ఆర్డర్స్‌ను రద్దు చేసి..తమకు నచ్చిన రీతిలో ఆర్డర్స్‌ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 26 ఆర్డర్స్‌ను అయితే పూర్తిగా మార్చేశారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

కుంభకోణంలో పావని పాత్ర ఏంటీ..?

డైరక్టర్ కార్యాలయంలో ఉన్న ఫార్మాసిస్ట్ పావని కూడా రికార్డ్‌లను తారుమారు చేసినట్లు అధికారులు గుర్తించారు. పావని తప్పుడు బిల్లులు సృష్టించినట్లు మొదట్లోనే గుర్తించిన అధికారులు.. ఆ తరువాత ఆమె బ్లాంక్ పేపర్స్‌ మీద అధికారులతో సంతకాలు తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఒరిజినల్ పత్రాలను ఫైల్‌ నుంచి తొలగించి..తాము సృష్టించిన పత్రాలను ఫైల్‌లో పెట్టినట్లు అధికారులు గుర్తించారు. జాయింట్ డైరక్టర్ పద్మ సూచనలు మేరకే..పావని పత్రాలు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. పావనితోపాటు శివ, ప్రభు, లింగలు కూడా ఇష్టానుసారంగా లెక్కలు రాసి ఒరిజినల్ రిజిస్ట్రర్‌లో బైండింగ్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఇండెండ్‌తో తయారు చేసిన దానిని ఓమ్మీ మెడి పార్మాకు పంపించారు. పాత డేట్స్‌ వచ్చిన ఈ నకిలీ ఇండెండ్స్‌ను ఓమ్మీ మెడి ఫార్మా ఓకే చేసింది.

డోన్ట్ కేర్ అన్న దేవికారాణి..!

ఆగస్ట్‌ , 2018లో ఈ నకిలీ ఇండెండ్స్ వచ్చినట్లు పద్మకు నాగరాజు సమాచారం ఇచ్చారు. ఇదే విషయం డైరక్టర్ దేవికారాణికి కూడా చెప్పాడు. డైరక్టర్ పీఏ ప్రమోద్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించాడు. అప్పటికే ఆరు తప్పుడు బిల్లులను గుర్తించాడు ప్రిన్సిపల్ సెక్రటరి లేబర్ అధికారి. ఈ తప్పుడు బిల్లులు మీద పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ఆదేశించాడు. లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరి మాటను కూడా దేవికరాణి పట్టించుకోలేదని సమాచారం. దీంతో ..దేవికారాణితోపాటు పద్మల మీద ప్రిన్సిపల్ సెక్రటరి మెమోలు జారీ చేశాడు.

ప్రిన్సిపల్ సెక్రటరీ వార్నింగ్ ఇచ్చిన కూడా దేవికారాణి లైట్ తీసుకుంది. ఓమ్మీ మెడి ఫార్మా పెట్టిన తప్పుడు బిల్లులు ఆమోదించింది. మొత్తం ఆరు బిల్లులను దేవికారాణి పాస్ చేసింది.

కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్‌ సురేష్ కృష్ణను కూడా మెడి ఫార్మా యజమాని నాగరాజు బెదిరించినట్లు తెలుస్తోంది. డైరక్టర్‌తో చెప్పి ఉద్యోగం తీయించేస్తానని నాగరాజు బెదిరించినట్లు సమాచారం.

ఒక దశలో కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా దేవికారాణి కాల్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. బిల్స్‌ను వెంటనే ఎంట్రీ చేసి పాస్‌ చేయాలని కంప్యూటర్‌ ఆపరేటర్‌ను దేవికారాణి ఆదేశించిందని అధికారులు గుర్తించారు. దేవికారాణి స్వయంగా కాల్ చేసి బెదిరించడంతో.. ఓమ్మి బిల్లును డైరక్టర్ వెంటనే పాస్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

Next Story