హైదరాబాద్ : ఈఎస్‌ఐ స్కాంపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 9కి వాయిదా వేశారు. నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరింది. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే..నిందితులు కస్టడీకే అవసరంలేదని వారి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసును మూడేళ్ల నుంచి విజిలెన్స్ దర్యాప్తు చేస్తుందని ..నిందితులు కస్టడీకి అవసరంలేదని న్యాయవాదులు వాదించారు. కస్టడాలోకి తీసుకుంటే సరైన ఆధారాలు చూపించాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. కస్టడీ పిటిషన్ కొట్టేసి నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు వాదించారు .

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.