హైదరాబాద్‌: ఈ ఎస్.ఐ.లో వందల కోట్లు కుంభకోణం జరిగిందన్నారు సీపీఎం సిటీ సెక్రటరి శ్రీనివాస్‌. అందుకే..గత ఐదు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నామన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఏసీబీ విచారణ చేపట్టిందన్నారు. ఈ.ఎస్‌.ఐ డైరక్టర్ దేవికారాణితోపాటు ఏడుగురి ఏసీబీ అరెస్ట్ చేసిందని తెలిపారు. కేవలం..రూ.11 కోట్లు మాత్రమే కుంభకోణం జరిగిందని ఏసీబీ చెబుతుందన్నారు. వాస్తవానికి వంద కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఏసీబీ అధికారులు మరింతలోతుగా విచారణ జరపాలన్నారు. కార్మిక శాఖలో ఇంత అవినీతి జరుగుతున్నా..కార్మిక శాఖ మంత్రి తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ అవినీతిలో భాగమైన మెడికల్ మాఫియా, రాజకీయ నేతలను కూడా విచారించాలని ప్రభుత్వాన్ని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.