అమరావతి: పర్యావరణ విధ్వంసాన్ని సహించేదిలేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. రాష్ట్ర రాజధానిలో అటవీ, పర్యావరణ శాఖలపై సమీక్ష నిర్వహించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. పరిశ్రమల కాలుష్య నియంత్రణకు గ్రీన్ టాక్స్ ఫాలసీని తీసుకువస్తామన్నారు జగన్‌. కాలుష్య నియంత్రణ బోర్డ్‌ను ప్రక్షాళన చేస్తామన్నారు. అంతేకాదు..ఈ వ్యర్ధాల కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.