ఓటీటీలోకి విశ్వక్సేన్‌ 'గామి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

విశ్వక్సేన్‌ హీరోగా నటించిన సినిమా 'గామి'. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 11:13 AM IST
vishwak sen, movie, gaami, ott release, zee5,

ఓటీటీలోకి విశ్వక్సేన్‌ 'గామి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.. 

విశ్వక్సేన్‌ హీరోగా నటించిన సినిమా 'గామి'. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల కాగా.. ఈ మూవీలో అఘోరాగా మెప్పించాడు విశ్వక్‌. ఈ మూవీకి ప్రేక్షకుల ఆదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచింది అంటూ గామి సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు. కొంత మంది ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయ్యారు. వారు ఎప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్‌న్యూస్‌ చెప్పారు మూవీ మేకర్స్.

గామి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానుంది. ఏప్రిల్ 12వ తేదీన డిజిటల్ రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి బ్లాక్‌ బస్టర్‌, తెలుగుతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించిన హనుమాన్ సినిమా కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు గామి కూడా జీ5లోనే అందుబాటులోకి రాబోతుంది. ఇక గామి సినిమాలో చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు.

Next Story