అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి'

ఓటీటీల్లో కొత్త సినిమాలు కొన్ని థియేటర్లలో విడుదలైన నెలలోపే దర్శనం ఇస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  9 Jun 2024 10:11 AM GMT
vishwak sen, gangs of Godavari, movie, ott release date,

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి'

ఓటీటీల్లో కొత్త సినిమాలు కొన్ని థియేటర్లలో విడుదలైన నెలలోపే దర్శనం ఇస్తున్నాయి. బిగ్‌ బడ్జెట్‌ సినిమాలు మినహా.. ఇతర చిత్రాలు త్వరగానే ఓటీటీలోకి వస్తున్నాయి. నెలలోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మరో కొత్త సినిమా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. మాస్‌ కా దాస్ విశ్వక్సేన్ ఇటీవల నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తిథియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ మూవీ.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలై నెల కూడా కాకముందే ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. ఈ సినిఆ జూన్ 14న తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

గోదావరి లంక గ్రామంలో ఈ కథ సాగుతోంది.పేరు లంకల రత్నాకర్ (విశ్వక్సేన్‌) దొంగతనాలు చేస్తూ ఉంటాడు. జీవితంలో బాగా ఎదగాలని అనుకుంటాడు. దాని కోసం ఎన్నో మోసాలు చేస్తుంటాడు. ఆ ఏరియాలో.. నానాజీ(నాజర్‌), దొరస్వామిరాజు(గోపరాజు రమణ)ల ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. వీరిలో దొరస్వామిరాజు ఆ ప్రాంత ఎమ్మెల్యే. దాంతో ఎలాగొలా దొరస్వామిరాజు పంచన చేరతాడు రత్నాకర్‌. తర్వాత అందులో కీలకం అవుతాడు. వర్గానికే నాయకుడు అవుతాడు. పోటికీ దిగి ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత రత్నాకర్ ఎలా మారాడు? ప్రేమలో ఎలా పడ్డాడు? రత్నాకర్‌కీ, రత్నమాలకీ ఉన్న సంబంధం ఏంటి? అనేది స్టోరీ.

Next Story