ప్రముఖ నటుడు విజయ్‌కాంత్‌కు అనారోగ్యం..ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ తమిళన నటుడు, రాజకీయ నేత విజయ్‌కాంత్ అనారోగ్యానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 12:49 PM ISTప్రముఖ నటుడు విజయ్‌కాంత్‌కు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ తమిళన నటుడు, రాజకీయ నేత విజయ్‌కాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఎన్నో సినిమాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన విజయ్‌కాంత్.. డీఎండీకే అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. విజయ్‌కాంత్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ్‌కాంత్‌కు తీవ్ర మధుమేహం ఉంది. దాంతో.. ఆయనకు అనారోగ్య సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన గొంతు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారనీ... దాంతో.. విజయ్‌కాంత్‌ని కుటుంబ సభ్యులు చెన్నై పోరూర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారని సమాచారం.
తీవ్రమైన గొంతునొప్పితో పాటు జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో విజయ్ కాంత్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. అనారోగ్యం కారణంగానే విజయ్‌కాంత్ కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయలేదు. విజయ్‌కాంత్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో ఆయన భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై పార్టీ చర్చలు జరుపుతున్నది. ఈ సమయంలోనే విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారన్న వార్తుల సంచలనంగా మారాయి.
మరోవైపు డీఎండీకే పార్టీ మాత్రం మరోలా స్పందించింది. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారని.. త్వరలోనే ఇంటికి చేరుకుంటారని డీఎండీకే ఒక ప్రకటనలో తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని, పుకార్లను నమ్మవద్దని పేర్కొంది. కొందరు అభిమానులు విజయ్‌కాంత్‌కు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆరాట పడుతున్నారు. పలువురు ఏ ఆస్పత్రో తెలుసుకుని అక్కడికి వెళ్తున్నారు.