విజయ్‌కాంత్‌ మృతి.. బోరున ఏడ్చేసిన స్టార్‌ హీరో (వీడియో)

విజయ్‌కాంత్‌ మరణం పట్ల కోలీవుడ్‌ స్టార్‌ హీరో విచారం వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  28 Dec 2023 3:10 PM IST
vijayakanth, death, hero vishal, emotional tweet,

విజయ్‌కాంత్‌ మృతి.. బోరున ఏడ్చేసిన స్టార్‌ హీరో (వీడియో)

తమిళనాట స్టార్‌ నటుడు, డీఎంకే అధినేత విజయ్‌కాంత్‌ మరణం అక్కడ విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే కోటీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్‌ మరణం పట్ల కోలీవుడ్‌ స్టార్‌ హీరో విచారం వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకున్నారు. బోరున విలపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన అభిమానులకూ కన్నీళ్లు తెప్పిస్తోంది.

హీరో విశాల్‌ కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు తీస్తుంటాడు. ఆయన సినిమాలకు అన్ని చోట్ల మార్కెటింగ్ ఉంటుంది. అయితే.. విజయ్‌కాంత్‌ మరణవార్తను విని హీరో విశాల్ తట్టుకోలేక పోయారు. ఎమోషనల్‌ అయిపోయారు. విజయ్‌కాంత్‌కు సంతాపం తెలుపుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఈ వీడియోలో మాట్లాడిన విశాల్.. కెప్టెన్ మరణించిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ వార్త విన్నాక తన కాళ్లు, చేతలు పనిచేయడం లేదని అన్నారు విశాల్. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా అంటూ కన్నీరు పెట్టారు. తాను నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విజయ్‌కాంత్ అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విజయ్‌ కాంత్‌ సార్‌కు ఇదే నా కన్నీటి నివాలి అని ఏడుస్తూ హీరో విశాల్ పోస్టు పెట్టారు.

తమిళస్టార్, డీఎంకే అధినేత విజయ్‌కాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్‌కాంత్ అనారోగ్యం కారణంగా మంగళవారం ఆస్పత్రిలో చేరారని వైద్యులు చెప్పారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మరణం పట్ల కోలీవుడ్‌, టాలీవుడ్.. రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.


Next Story