ఓటీటీలో 'లియో' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

దళపతి విజయ్‌ సినిమా లియో ఓటీటీలో విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 11:28 AM IST
vijay thalapathy, leo movie, ott release,

ఓటీటీలో 'లియో' సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ఇటీవల నటించిన చిత్ర 'లియో'. ఈ మూవీ థియేటర్లలో అక్టోబర్‌ 19న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సూపర్బ్‌ మ్యూజిక్‌తో అదరిపోయింది ఈ మూవీ. అయితే.. ఇప్పుడు ఓటీటీలో కూడా అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూసేద్దామా అని వెయిట్‌ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్‌ అందింది. లియో మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది.

లియో సినిమాకు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించాడు. గౌతమ్‌ మీనన్, అర్జున్, సంజయ్‌ దత్, మన్సూర్‌ ఆలీఖాన్‌ తదితరు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో 'లియో' సినిమా నవంబర్‌ 24న నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సోషల్‌ మీడియాలో తెలుపుతూ.. అన్నర్‌ వార్‌ వళీ విడు (అన్న వస్తున్నాడు దారి ఇవ్వండి) అంటూ తమిళ్‌లో రాసుకొచ్చింది. అయితే.. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇండియాలో నవంబర్‌ 24 నుంచి అందుబాటులోకి వస్తుండగా.. గ్లోబల్‌ వైడ్‌గా మాత్రం నవంబర్‌ 28వ తేదీ నుంచి అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

లియో సినిమాకు అనిరుధ్‌ అందించిన సంగీతం హైలట్‌గా నిలిచింది. బ్యాగ్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించడంలో తన మార్క్‌ను మరో సారి చూపించాడు అనిరుధ్. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ సంజయ్, యాక్షన్ కింగ్ అర్జున్‌ కనిపించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Next Story