ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి 'మహారాజ'
త్వరలోనే ఓటీటీలో మరో కొత్త సినిమా విడుదల కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 8 July 2024 1:30 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి 'మహారాజ'
త్వరలోనే ఓటీటీలో మరో కొత్త సినిమా విడుదల కాబోతుంది. విజయ్ సేతుపతి ఇటీవల హీరోగా నటించి థియేటర్లలో విడుదలైన సినిమా మహారాజ. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఒక్క తమిళ్‌లో మాత్రమే కాదు.. అన్ని భాషాల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదే సినిమా తాజాగా ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది.
థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలో వస్తుండటంతో సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. బిగ్ స్క్రీన్‌పై మిస్ అయిన వారు ఓటీటీలో చూడాలని కుతూహలంగా ఉన్నారు. కాగా.. మహారాజ మూవీ ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జూలై 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ మూవీకి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించారు. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు నటించారు.
విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఆయన కెరీర్‌లోని హిట్ చిత్రాల వరుసలో చేరింది. మరోసారి ఓటీటీలో విడుదల కానుండటంతో.. ఎంత మేర ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.