తన పెంపుడు కుక్కను విమానంలో తిప్పుతున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda shares video of his dog enjoying first plane ride.విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో

By M.S.R
Published on : 19 Jan 2022 2:22 PM IST

తన పెంపుడు కుక్కను విమానంలో తిప్పుతున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే..! ఇన్‌స్టాగ్రామ్‌లో 14.3 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. అతని సోషల్ మీడియా పోస్ట్‌లను ఎంతగానో ఇష్టపడేవారున్నారు. తన ఖాళీ సమయంలో, విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కతో గడపడానికి ఇష్టపడతాడు. 'స్టార్మ్' అని ముద్దుపేరు పెట్టుకున్న విజయ్ తన పెంపుడు కుక్కకు సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటాడు.

ఇటీవల విజయ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో స్టార్మ్ కు సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. తన పెంపుడు కుక్క మొదటి విమాన ప్రయాణాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. ఈ వీడియో అనతికాలంలోనే 13 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించుకుంది. వీడియోలో, విజయ్ దేవరకొండ ఆదేశాలను పాటిస్తున్న స్టార్మ్‌తో గడుపుతూ ఉండడాన్ని గమనించవచ్చు. విజయ్ దేవరకొండ, "ఈ జెంటిల్‌మన్ యొక్క మొదటి విమాన ప్రయాణం" అని పోస్ట్ పెట్టాడు. నీ పనే బాగుంది అంటూ స్టార్మ్ ను చూసి నెటిజన్లు అసూయపడుతున్నారు.

విజయ్ దేవరకొండ ఇప్పుడు తన పాన్-ఇండియా చిత్రం లైగర్ లో నటిస్తున్నాడు. ఇది అతని బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీకి కారణమవుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే కూడా నటించింది. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరూ యష్ జోహార్ మరియు పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. పూరీ మార్క్ ఇప్పటికే సినిమా టీజర్ లో కనిపించింది. ఆగష్టు నెలలో సినిమా విడుదల చేస్తూ ఉన్నారు.

Next Story