సామ్‌కు విజయ్ దేవరకొండ వీడియోకాల్..ఎందుకంటే..
సమంతతో విజయ్ దేవరకొండ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 11:28 AM IST
సామ్‌కు విజయ్ దేవరకొండ వీడియోకాల్..ఎందుకంటే..
విజయ్ దేవరకొండ, సమంత తాజాగా కలిసి నటించిన చిత్రం 'ఖుషీ'. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. మరోసారి.. ఇలాంటి వైరల్ పోస్టునే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అప్‌లోడ్ చేశారు. అదే సమంతతో విజయ్ దేవరకొండ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే.. సమంతకు వీడియో కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. నీకొక జోక్ చెప్పాలని వీడియోకాల్ చేశాను అంటాడు. దానికి సమంత.. ఇప్పుడు టైమ్ అర్ధరాత్రి 1:30 అవుతోంది.. ఇప్పుడు జోక్ ఏంటని ప్రశ్నిస్తుంది. అంతేకాదు.. వీడియోలో సమంత కోసం విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలోని 'నా రోజా నువ్వే' పాటను కూడా పాడాడు. అయితే.. ఖుషీ మూవీలోని ఈ సాంగ్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో బోలెడు వ్యూస్‌ను సంపాదించింది. వీడియో కాల్‌లో సామ్‌తో మాట్లాడిన విజయ్.. ఆమెను మిస్ అవుతున్నట్లు కూడా చెప్పాడు. ఈ వీడియోకాల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చాలా బావుందంటూ కామెంట్స్ పెడుతుందగా.. కొందరేమో వీడియో కాల్ కాదని.. రికార్డ్ చేసిన వీడియోని ఎడిట్ చేశారని చెప్తున్నారు. ఏదేమైనా విజయ్ ట్వీట్‌తో మారోసారి 'ఖుషీ' సినిమా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Knock knockWho is there?#Kushi is - in 4 days! Yayyyy! 🥰@Samanthaprabhu2 pic.twitter.com/9lfNfxPbGk
— Vijay Deverakonda (@TheDeverakonda) August 27, 2023
మరోవైపు 'ఖుషీ' సినిమాపై కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. ఓ సూపర్ హిట్ మూవీ గుర్తుకు వస్తుందని చెప్పారు. అయితే... ఈ రూమర్స్‌పై తాజాగా మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. పెళ్లి తర్వాత ఒక జంట జీవితం ఎలా ఉంటుంది.. అనే లైన్‌పైనే సినిమా తీశానని చెప్పారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుందని.. ఏ సినిమాతోనూ పొలిక ఉండదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఇలాంటి విషయాలు సినిమాగా కన్నా.. ఒక పాట రూపంలోనే తీస్తారని.. కానీ తాను కథగా మలిచి సినిమాగా రూపొందించానని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.