విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త సినిమా అప్‌డేట్

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాపై కీలక అప్‌డేట్‌ వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  4 May 2024 4:45 PM IST
Vijay devarakonda, new movie, update, director ,

విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త సినిమా అప్‌డేట్ 

ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ మెప్పించాడు. మంచి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు.. మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది ఈ సినిమా. మృణాల్‌ ఠాకూర్‌ ఫ్యామిలీ స్టార్‌ మూవీలో విజయ్‌కి జోడిగా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్‌ అయినవారు.. విజయ్‌ ఫ్యాన్స్‌ మరోసారి ఫ్యామిలీ స్టార్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా..తాజాగా విజయ్‌ దేవరకొండ తన కొత్త సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చాడు. తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. రవి కిరణ్‌ కోలా డైరెక్షన్‌లో పొలిటికల్ డ్రామాగా కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్‌ రవి కిరణ్‌ వెల్లడించాడు. రెండో సినిమా కావడంతో కొంచెం సమయం తీసుకుని చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు పొలిటికల్ డ్రామా కావడంతో కాస్త ఎక్కువగానే స్టడీ చేయాల్సి వచ్చిందని డైరెక్టర్ రవి కిరణ్ వెల్లడించాడు. ఏ పాయింట్‌ చెప్పినా ఏదో ఇచ్చాం అన్నట్లు కాకుండా పర్‌ఫెక్ట్‌గా చెప్పాలని నిర్ణయం తీసుకున్నానీ అన్నారు. చూసే వారికి సిల్లీగా అనిపించకుండా గొప్పగా అనిపించేలా ఈ సినిమాను తీస్తానని అన్నారు. ఎక్కువ టైమ్‌ తీసుకుని స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేశాననీ.. చాలా బాగా వచ్చిందని రవి కిరణ్‌ చెప్పారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశవర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. కాగా.. డైరెక్టర్‌ రవి కిరణ్‌ కోలా తొలి సినిమా 'రాజావారు రాణిగారు' తీశారు. తొలి సినిమాతోనే హిట్‌ను అందుకున్నారు.

Next Story