ఇష్టమైన కోస్టార్‌ అతనే అని చెప్పిన మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమా తర్వాత ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్.

By Srikanth Gundamalla  Published on  3 April 2024 4:26 PM IST
vijay devarakonda, mrunal thakur, family star ,

ఇష్టమైన కోస్టార్‌ అతనే అని చెప్పిన మృణాల్ ఠాకూర్ 

సీతారామం సినిమా తర్వాత ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. స్క్రిప్ట్‌ సెలక్షన్‌.. తన నటనతో అభిమానులను రెట్టింపు చేసుకుంటోంది. తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్‌' సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే మృణాల్ ఠాకూర్‌ ఓ ఇంటర్వూలో పాల్గొని తనకు ఇష్టమైన కోస్టార్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

ఇష్టమైన కోస్టార్‌ ఎవరు అని మృణాల్‌ ఠాకూర్‌ను అడగ్గా.. ఆమె తనకు ఇష్టమైన కోస్టార్‌ ఎవరు అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే అని చెప్పింది. కానీ.. దుల్కర్ సల్మాన్‌ అని చెప్పగలను అంటూ అతని పేరు చెప్పింది. సీతారామం సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంది మృణాల్. అయితే.. దుల్కర్‌ సల్మాన్‌ వల్లే తాను సీత పాత్ర సక్సెస్‌గా చేయగలిగాను అని పేర్కొంది. ప్రస్తుతం ఇన్ని భాషల్లో తనకు ఆదరణ దక్కింది అంటే ఆయన స్ఫూర్తే అని చెప్పింది. దుల్కర్‌ కోస్టార్‌.. ఇంకా తనకు మంచి స్నేహితుడు అని చెప్పింది. రాబోయే తన మూవీ ఫ్యామిలీ స్టార్‌ గురించి మాట్లాడుతూ పూర్తి స్థాయి కుటుంబానికి సంబంధించిన సినిమా అని మృణాలు చెప్పింది.

ఏప్రిల్ 5వ తేదీన 'ఫ్యామిలీ స్టార్' మూవీ వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఇక్కడ ఈ మూవీ ఒక రికార్డును క్రియేట్‌ చేయబోతుంది. సౌత్‌ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో కూడా విజయ్‌ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' వంటి పెద్ద సినిమా కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్‌లలోనే విడుదల అయ్యాయి. కానీ.. ఉరుగ్వేలో మాత్రం తెలుగు సినిమాలు విడుదల కాలేదు. దాంతో.. ఉరుగ్వేలో విడుదల కానున్న తెలుగు మొదటి సినిమా విజయ్‌ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు.. ట్రైలర్‌ వంటివి ఫ్యాన్స్‌లో హైప్‌ను పెంచాయి. ఫ్యామిలీ స్టార్‌ విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి రిలీజ్‌ అయ్యాక ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Next Story