ఓటీటీలోకి విజయ్ ఆంటోని 'రోమియో' మూవీ, తెలుగులో కూడా..
బిచ్చగాడు సినిమాతో తమిళ్‌తో పాటు తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ ఆంటోని.
By Srikanth Gundamalla Published on 8 May 2024 8:15 AM GMTఓటీటీలోకి విజయ్ ఆంటోని 'రోమియో' మూవీ, తెలుగులో కూడా..
బిచ్చగాడు సినిమాతో తమిళ్‌తో పాటు తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్ ఆంటోని. అతనే డైరెక్షన్ చేసుకుంటూ బిచ్చగాడుతో పాటు ఇంకా కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక మరోసారి బిచ్చగాడు-2తో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల ప్రేమను పొందాడు. బిచ్చగాడు-2 తర్వాత విజయ్ ఆంటోని నటించిన మరో చిత్రం 'రోమియో'. తమిళ్‌లో ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఇక తెలుగులో ఈ సినిమా 'లవ్‌గురు' టైటిల్‌తో విడుదల అయ్యింది.
ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది విజయ్ ఆంటోని మూవీ రోమియో. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతుంది. థియేటర్లలో చూడని జనం.. ఓటీటీలో చూసే అవకాశాలు ఉన్నాయి. మే 10వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటుగా తెలుగులో అందుబాటులో ఉండనుంది ఈ రోమియో సినిమా. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ పక్కన హీరోయిన్‌గా మృణాళిని రవి నటించింది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కి ఈ సినిమాకు.. భరత్ ధనశేఖర్ మ్యూజిక్ వాయించాడు.
రోమియో సినిమా కథేంటంటే... ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అరవింద్ (విజయ్ ఆంటోని) అనుకుంటాడు. హీరోయిన్‌గా రాణించాలని లీల (మృణాళిని రవి) ఎంతో ఆశపడుతుంది. తన కోరిక మేరకు ముందుకెళ్లాలని అనుకుంటుంది. అయితే.. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. మరి ఆ తర్వాత వీరి లవ్ ఎంత వరకు వెళ్లింది? ఇద్దరి ఆశలు నెరవేరాయా? లేదా అన్నది మిగతా స్టోరీ. థియేటర్లలో మెప్పించలేకపోయిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఓటీటీలో మంచి వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. మరి విజయ్ ఆంటోని లవ్ గురు మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.