ప్రముఖ నటుడి ఆరోగ్యం విషమం.. దాతల కోసం ఎదురు చూపు

Veteran actor Shivkumar Verma on ventilator ... ప్రముఖ హిందీ నటుడు శివకుమార్‌ వర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

By సుభాష్  Published on  3 Dec 2020 12:22 PM IST
ప్రముఖ నటుడి ఆరోగ్యం విషమం.. దాతల కోసం ఎదురు చూపు

ప్రముఖ హిందీ నటుడు శివకుమార్‌ వర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఆయన.. ఎవరైనా దాతలు సాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు సినీ,టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నటుడు పరిస్థితిపై అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతాలలో పోస్టు చేశారు. ఇది చాలా అత్యవసరమని, శివకుమార్‌ వర్మ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. అయితే ఆయనకు కోవిడ్‌ సోకి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివకుమార్‌ వర్మ పరిస్థితిపై నటుడు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, విద్యాబాలన్‌ సహా పలువురు ప్రముఖులను ట్యాగ్‌ చేశారు. బాజీ జిందగీ, హల్లా బోల్‌ వంటి చిత్రాల్లో శివకుమార్‌ నటించారు.

కాగా, శివకుమార్‌ నవంబర్‌ 30న సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్స కోసం రూ.3 నుంచి రూ. 4 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపినట్లు ఆయన ఓ లేఖలో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ఈ మేరకు ఆయన బ్యాంకు ఖాతా నెంబర్‌ కూడా ట్వీట్‌ చేశారు.

Next Story