వెంకటేశ్‌ 'సైంధవ్' సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన సైంధవ్‌ సినిమా.. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది.

By Srikanth Gundamalla  Published on  31 Jan 2024 3:00 PM IST
venkatesh, saindhav movie, ott release, amazon prime,

వెంకటేశ్‌ 'సైంధవ్' సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ 

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన సైంధవ్‌ సినిమా.. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వంలో యాక్షన్ కథాంశంతో రూపొందింది. థియేటర్లలో ప్రేక్షకులను ఈ సినిమా ఫరవాలేదనిపించింది. సైంధవ్ సినిఆకు శైలేశ్‌ కొలను దర్శకత్వం వహించారు. అయితే.. సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

సైంధవ్ సినిమాలో వెంకటేశ్‌ పక్కన హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా సహా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే.. ఈ సినిమా అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మూడు వారాలకే సినిమా ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో.. థియేటర్లలో మూవీని మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చంద్రప్రస్థ అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగుతుంది ఈ కథ. సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేశ్‌)కు కూతురు ఉంటుంది. పాప కోసమే అన్ని వదులుకుని భార్య కిచ్చిన మాటతో బతకుతుంటాడు. అయితే.. భర్తతో విడిపోయిన మనో (శ్రద్ధా శ్రీనాథ్‌)తో అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడే సైంధవ్ కోనేరు కూతురికి అనారోగ్యం పాలవుతుంది. ఆమె జబ్బు కోసం రూ.17కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం పడుతుంది. ఆ డబ్బుని సైంధవ్ ఎలా సంపాదించాడు? బిడ్డను కాపాడుకున్నాడా? సహా ఇతర అంశాలపై సినిమా కొనసాగుతుంది.





Next Story