వరుణ్‌, లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌, ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్

వరుణ్, లావణ్యల ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి.

By Srikanth Gundamalla  Published on  7 Oct 2023 2:00 PM IST
varun tej, lavanya, pre wedding, celebrations, chiranjeevi tweet,

వరుణ్‌, లావణ్య ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌, ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్ 

టాలీవుడ్‌లో మరో లవ్‌ మ్యారేజ్‌ జరగబోతుంది. అందరికీ తెలిసిందే మెగా హీరో వరుణ్‌ తేజ్‌... హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే.. వీరి ఎంగేజ్‌మెంట్‌ కూడా జూన్‌లో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్‌ అయ్యిందని తెలుస్తోంది. వరుణ్‌, లావణ్యల వివాహం నవంబర్‌ 1న డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారట. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని సమాచారం. అయితే.. తాజాగా ఈ జంట ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. దానికి సంబంధించిన ఫొటోలను మెగాస్టార్‌ చిరంజీవి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా షేర్‌ చేసుకున్నారు.

శుక్రవారం సాయంత్రమే వరుణ్, లావణ్యల ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు.. రామ్‌చరణ్‌, ఉపాసన, నాగబాబు ఫ్యామిలీ, వైష్ణవ్‌ తేజ్, సాయి ధరమ్‌ తేజ్, అల్లు శిరీష్, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరుణ్‌, లావణ్య జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

వరుణ్‌తేజ్, లావణ్య కలిసి ఆరేళ్ల క్రితం మిస్టర్‌ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ద్వారానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమాలోనూ నటించారు. అదే అంతరిక్షం సినిమా. అయితే.. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఇక అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లింది. వీరి ప్రేమను గోప్యంగా ఉంచుతూనే వచ్చారు. పెళ్లి అనౌన్స్‌ చేసే దాకా ఎవరికీ తెలియదు. వీరి రిలేషన్‌ షిప్‌పై ఎన్ని వార్తలు వచ్చిన స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి వరుణ్, లావణ్య జంట చూడముచ్చటగా ఉందని మెగా అభిమానులు అంటున్నారు. వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

Next Story