నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్
Varalaxmi Sarathkumar's Twitter and Instagram accounts hacked .. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యా
By సుభాష్ Published on
3 Dec 2020 10:14 AM GMT

ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. తమ పర్సనల్ విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన సంగతులని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన పాపులర్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుపుతూ తాజాగా ఆమె ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
నా అభిమానులు, మీడియాకు నా విన్నపం ఏమంటే.. నా సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ హ్యక్ అయ్యాయని తెలిపారు. 'గత రాత్రి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్‌కి గురయ్యాయి. నా అకౌంట్స్ రికవర్ చేయాల్సిందిగా సంబంధిత టీంలను కోరాను. కొద్దిరోజుల సమయం పడుతుందని చెప్పారు. నా ఫాలోవర్స్, శ్రేయోభిలాషులు.. నా అకౌంట్స్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి. నా అకౌంట్లు పునరుద్ధరణ తర్వాత అభిమాలకు ఆ విషయం తెలియజేస్తానని వరలక్ష్మి వెల్లడించారు.
Next Story