పాప పేరు ఏం పెట్టాలో ముందే అనుకున్నాం.. కానీ: రామ్‌చరణ్‌

పాప లేదంటే బాబు ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలనేది ముందే అనుకున్నాం. కానీ..

By Srikanth Gundamalla  Published on  23 Jun 2023 6:58 PM IST
Upasana, Ramcharan, Daughter, Chiranjeevi

పాప పేరు ఏం పెట్టాలో ముందే అనుకున్నాం.. కానీ: రామ్‌చరణ్‌

రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఆమె శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను రామ్‌చరణ్‌ తీసుకెళ్తూ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాసనకు అపోలో ఆస్పత్రిలో వైద్యం అందించిన డాక్టర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

రామ్‌చరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. "ఉపాసన, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మంచి డాక్టర్లు చికిత్స చేశారు. అభిమానుల ప్రేమను కూడా మర్చిపోలేను. అభిమానులను ఇంతకంటే ఏం అడగగలను. ఇతర దేశాల నుంచి కూడా బ్లెసింగ్స్‌ ఇచ్చారు. ఇంతకన్నా ఆనందం నాకు మరోటి లేదు. పాపకు ఆశీర్వాదాలు అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాన్నగారు (చిరంజీవి) కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాబు, పాప ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టుకోవాలనేది ఉపాసన నేనూ ముందే అనుకున్నాం. అయితే అదేంటో ఇప్పుడే చెప్పలేను. సంప్రదాయం ప్రకారం ఈ రోజున పేరు పెట్టాలో అప్పుడే స్వయంగా అందరితో నేనే పంచుకుంటా" అని రామ్‌ చరణ్‌ మీడియాతో చెప్పారు.

Next Story