అన్నాడీఎంకే మాజీ నేతకు లీగల్ నోటీసు పంపిన త్రిష

హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 2:48 PM IST
trisha, legal notice,  av raju,

అన్నాడీఎంకే మాజీ నేతకు లీగల్ నోటీసు పంపిన త్రిష

హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సీరియస్‌గా తీసుకున్న త్రిష చర్యలకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు పరువు నష్టం కేసు వేసింది. తన లాయర్ ద్వారా ఏవీ రాజుకు లీగల్ నోటీసులను పంపించింది త్రిష. ఈ విషాన్ని స్వయంగా నటి త్రిష సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. లీగల్ నోటీసుల ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంది.

రాజకీయ నేత ఏవీ రాజు, ఎమ్మెల్యే జి.వెంకటాచలానికి మధ్య వివాదం కొనసాగింది. అయితే.. ఏవీ రాజు.. వెంకటచలాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ హద్యలోనే హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరును కూడా ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత జీవితంపైనా సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఏవీ రాజు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవ్వగా తెగ వైరల్ అయ్యింది. త్రిష కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అభిమానులతో పాటు ఇతర సినీతారలు ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఎంత నీచానికైనా దిగజరుతారా అంటూ త్రిష మండిపడింది. తన ఓపిక నశించిందనీ.. ఇక చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ముందే చెప్పింది.

ఇక ఏవీ రాజు తన వ్యాఖ్యల పట్ల స్పందించారు. త్రిషకు క్షమాపణలు కూడా చెప్పారు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నటిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదనీ.. దర్శకుడు చరణ్, నటుడు కరుణాదాస్‌ సహా ఇతరులకు క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని ఏవీ రాజు పేర్కొన్నారు.

Next Story