చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ హీరోయిన్ కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ హీరోయిన్ అంజనా భూమిక్ (79) ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 4:54 AM GMTచిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ హీరోయిన్ కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ హీరోయిన్ అంజనా భూమిక్ (79) ప్రాణాలు కోల్పోయారు. ఆమె గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజనా భూమిక్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న అంజనా భూమిక్‌ను ఆమె కూతుర్లు చూసుకున్నారు. శుక్రవారం ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ శనివారం వరకు చికిత్స పొందిన అంజనా భూమిక్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
అంజనా భూమిక్ 1944 డిసెంబర్‌లో బీహార్‌లో జన్మించారు. అంజనా అసలు పేరు ఆరతి. బీహార్ సొంత రాష్ట్రం కాగా.. చదువు కోసం కోల్‌కతా వెళ్లారు. ఆ తర్వాత అక్కడే సెలిట్ అయ్యారు. 20 ఏళ్ల వయసులో 1964లో బెంగాలీ చిత్రం ‘అనుస్టూప్ ఛంద’తో అంజనా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘థానా థేకే అస్చీ’ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యారు. థానా థేకే అస్చీ, చౌరంగీ, నాయికా సంబాద్, కభీ మేఘ్ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించారు. 2012లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు అంజనా భూమిక్. అంజనా ఎయిర్‌ఫోర్స్ అధికారి అనిల్ శర్మను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పారు. అంజనాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.