చిత్ర పరిశ్రమలో విషాదం.. షఫీ కన్నుమూత
తన చిత్రాల ద్వారా మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు షఫీ కన్నుమూశారు.
By M.S.R
చిత్ర పరిశ్రమలో విషాదం.. షఫీ కన్నుమూత
తన చిత్రాల ద్వారా మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు షఫీ కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 56 సంవత్సరాలు.షఫీ అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఆయన అసలు పేరు రషీద్. జనవరి 16న స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణానికి ముందు చాలా రోజుల పాటు తీవ్ర అస్వస్థతతో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి 12.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
షఫీ 2001లో 'వన్ మ్యాన్ షో' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దర్శకుడు సిద్ధిక్ రఫీ వాళ్ల మేనమామ. ప్రముఖ చిత్రనిర్మాత రాజసేనన్ దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన షఫీ. 'వన్ మ్యాన్ షో'తో మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో, షఫీ పది చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కామెడీ చిత్రాలు నిర్మించి ప్రశంసలు పొందాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు పలు భాషల్లో రీమేక్ కూడా అయ్యాయి.