హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం
హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 12:00 PM ISTహీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం
హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పూజాకు ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో 'విల్ మిస్ యూ అజ్జి' అంటూ స్టేటస్ పెట్టింది. ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే.. అమ్మమ్మ అంటే పూజా హెగ్డేకు చాలా ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. ఇటీవలే బుట్టబొమ్మ తన చెల్లెలు భూమి పెళ్లిలో సందడి చేస్తూ కనిపించింది. అంతలోనే తనకు ఎంతో ఇష్ట మైన వ్యక్తిని కోల్పోయింది. ఇక అమ్మమ్మ చనిపోయి విషాదంలో ఉన్న పూజా హెగ్డెకు అభిమానులు ధైర్యం చెబుతున్నారు. గతంలో కూడా తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలను పూజా హెగ్డే షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దావిడ ప్రాణాలు కోల్పోవడంతో పూజా హెగ్డే కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు. గుంటూరు కారం మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే సల్మాన్‌తో కిసికా జాన్ మూవీ చేసింది. బాలీవుడ్‌లో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పటికే టాలీవుడ్‌లో అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. బాలీవుడ్‌లో కూడా ఫ్లాప్ పడటంతో అక్కడ కూడా చాన్స్‌లు లేని పరిస్థితి ఎదురైంది. తెలుగులో ఆచార్య సినిమా తర్వాత పూజా హెగ్డే ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో ఐరన్ లెగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కానీ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది పూజా హెగ్డే.