ఎన్టీఆర్ అరుదైన ఘనత.. తెలుగు నుంచి తారక్ మాత్రమే..
తారక్ తాజాగా మరో ఘనతను సాధించారు. 2023 ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 2:54 PM IST
ఎన్టీఆర్ అరుదైన ఘనత.. తెలుగు నుంచి తారక్ మాత్రమే..
'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ స్టార్స్ జాబితాలో చేరారు. అంతర్జాతీయంగా అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అయితే.. తారక్ తాజాగా మరో ఘనతను సాధించారు. 2023 ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఏషియన్ వీక్లీ మ్యాగజిన్ ఈ మేరకు జాబితాను ప్రకటించింది. ఇందులో తారక్‌కు స్థానం లభించింది. 'ఈస్టర్న్ ఐ 2023' పేరిట ఈ జాబితాను వెల్లడించగా.. ఎన్టీఆర్ 25వ స్థానంలో నిలిచారు.
అంతేకాదు.. ఈ జాబితాలో తెలుగు ఇండస్ట్రీ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆరే. ఈ లిస్ట్‌లో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ నటీనటులు చోటు దక్కించుకున్నారు. ఇటీవల అమెరికన్ మ్యాగజైన్ 'వెరైటీ' ప్రకటించిన 500 మంది అత్యంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరికీ చోటు దక్కింది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ పాత్రలో మరో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. సముద్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫైట్స్ ఓ రేంజ్‌లో ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే గోవాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తోంది. దేవర సినిమా మొదటి భాగం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. దాంతో.. షూటింగ్‌ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. దేవర సినిమానే కాదు.. మరో ప్రతిష్టాత్మక బాలీవుడ్ సినిమా 'వార్-2'లో కూడా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.