ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్‌ఆర్‌ అవార్డ్

ఈ ఏడాది ఏఎన్‌ఆర్‌ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నట్లు అక్కినేని నాగార్జున

By Srikanth Gundamalla  Published on  20 Sept 2024 8:00 PM IST
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్‌ఆర్‌ అవార్డ్

ఈ ఏడాది ఏఎన్‌ఆర్‌ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నట్లు ఆయన తనయుడు.. అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈ మేరకు మాట్లాడిన అక్కినేని నాగార్జున .. అమితాబ్‌ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డును అందించబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 100వ పుట్టినరోజు వేడుకలను అక్కినేని ఫ్యామిలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య మినహా అక్కినేని కుటుంబం మొత్తం హాజరైంది. ఈ సందర్భంగానే ఏఎన్నార్ అవార్డ్‌ను ఈ ఏడాదికి ఎవరికి ఇవ్వబోతున్నామనే దానిపై నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. మెగాస్టార్ చిరంజీవికి అక్టోబర్ 28న బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు. అలాగే బాపుగారు గీసిన ఏఎన్నార్ చిత్రాన్ని పోస్టల్ స్టాంప్ రూపంలో విడుదల చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున చెప్పారు.

నాగార్జున ఇంకా మాట్లాడుతూ.. తమ నాన్న అంటే వారికెంతో ప్రేమ అన్నారు. ఎప్పుడూ నవ్వుతూ జీవించడమే ఆయన నేర్పించారని అన్నారు. 31 నగరాల్లో 60కి పైగా థియేటర్స్‌లో ఏఎన్‌ఆర్‌ సినిమాలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలన్నింటినీ ఉచితంగా చూడవచ్చన్నారు నాగార్జున. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవికి అక్టోబర్ 28న బిగ్ బి అమితాబ్‌గారి చేతుల మీదుగా ప్రధానం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయం చిరంజీవికి చెప్తే.. ఆయన సంతోషం వ్యక్తం చేశారని నాగార్జున చెప్పారు.


Next Story