ఈ వారం విడుదల కానున్న సినిమాలు, ఓటీటీ కంటెంట్స్‌ ఇవే

ఈ వారం సినిమా థియేటర్లలో పెద్ద సినిమాలేవి విడదల కావడం లేదు.

By Srikanth Gundamalla  Published on  3 July 2023 5:18 PM IST
this Week, OTT, Theatre, Movies, Web Series,

ఈ వారం విడుదల కానున్న సినిమాలు, ఓటీటీ కంటెంట్స్‌ ఇవే

ఈ వారం సినిమా థియేటర్లలో పెద్ద సినిమాలేవి విడదల కావడం లేదు. కానీ చిన్నసినిమాలు మాత్రం వరుస పెట్టి వస్తున్నాయి. దాదాపుగా 10 సినిమాల వరకు ఈ వారం థియేటర్లలో విడుదల కానున్నాయి. థియేటర్లలో కాకుండా ఇళ్లలోనే ఉండి ఓటీటీల ద్వారా ఎంటర్‌టైన్మెంట్‌ పొందేవారే ఎక్కువగా ఉంటారు. అయితే.. వారికి కోసం కూడా ఆయా ఓటీటీ ప్లాట్‌ఫాంలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి తీసుకురానున్నాయి.

'రంగబలి' సినిమా ఈ నెల 7వ తేదీని థియేటర్లలో విడుదల కానుంది. హీరోగా నాగశౌర్య నటించారు. యుక్తి తరేజా, సత్య, సప్తగిరి, బ్రహ్మాజి ఈ సినిమాల్లో కనిపించనున్నారు. పవన్‌ బాసంశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత.

ఈ నెల 7న థియేటర్లలో విడుదలవుతున్న సినిమా 'భాగ్‌ సాలే'. శ్రీసింహా కోడూరి, నేహా సొలంకి, వైవా హర్ష, రాజీవ్‌ కనకాల సహా ఇతర నటులు ఇందులో నటించారు. శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా వచ్చిన తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో వచ్చిన 'భాగ్‌ సాలే' చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.

జగపతిబాబు లీడ్‌రోల్‌లో నటించిన 'రుద్రంగి' సినిమా కూడా ఈ నెల 7న విడుదల కానుంది. ఇందులో మమతా మోహన్‌దాస్, విమలారామన్, ఆశిష్‌ గాంధీ తదితరులు నటించారు. అజయ్‌ సామ్రాట్‌ దర్శకుడు. నిర్మాత రసమయి బాలకిషన్.

ఈ నెల 7న విడుదల అవుతోన్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా '7:11 PM'. టైమ్‌ ట్రావెలర్‌ కంటెంట్‌తో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంది. సాహస్, దీపిక తదితరులు ఇందులో నటించారు.

ఇక ఓటీటీల్లో విడుదలవుతున్న కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు:

'స్వీట్‌ కారం కాఫీ' (తెలుగు వెబ్‌ సిరీస్‌). ఈ నెల 6న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. 8 ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. మూడు తరాలకు చెందిన ముగ్గురు మహిళలు కలిసి సాగించిన ప్రయాణం గురించే ఈ కథ. సిరీస్‌లో లక్ష్మి, మధు, శాంతి కీలక పాత్రలు పోషించారు.

'అధుర' థ్రిల్లర్‌ సినిమా. జీ5 వేదికగా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. గౌరవ్‌ చావ్లా, అనన్య బెనర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ థ్రిల్లర్‌ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

'ఫర్హానా' సినిమా సోనీలివ్‌ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు. ఎస్‌.ఆర్‌ ప్రభు నిర్మించారు. నెల్సన్‌ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేశ్, శ్రీరాఘవ, ఐశ్వర్య దత్త ప్రధాన పాత్రల్లో నటించారు. 'ఫర్హానా' సినిమా సోనీలివ్‌లో తెలుగుతో పాటు తమిళ్‌లో అందుబాటులో ఉండనుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం చాలా ఇంగ్లీష్‌ సహా ఇతర భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి.

Next Story