సత్యదేవ్ 'తిమ్మరుసు' ఫస్ట్ లుక్

Thimmarusu First Look.. 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో అభిమానుల‌ను సొంతం చేసుకున్న న‌టుడు

By సుభాష్  Published on  5 Dec 2020 1:16 PM IST
సత్యదేవ్ తిమ్మరుసు ఫస్ట్ లుక్

'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో అభిమానుల‌ను సొంతం చేసుకున్న న‌టుడు స‌త్య‌దేవ్‌. తాజాగా ఆయన నటిస్తున్న ''తిమ్మరుసు''. 'అసైన్మెంట్ వాలి' అనేది దీనికి ఉపశీర్షిక. అయితే ఈ సినిమాలోని సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసింది చిత్రబృందం. సత్యదేవ్ చేతిలో ఓ సూట్ కేస్ పట్టుకొని బైక్ పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. టీజర్ ను ఈనెల 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సత్యదేవ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందట.

ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది.

Next Story