నటుడు-రాజకీయవేత్త తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు జాసన్ సంజయ్. లైకా ప్రొడక్షన్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోని అనౌన్స్‌మెంట్ వీడియోలో, జాసన్ తొలి చిత్రంలో 'సందీప్ కిషన్' ప్రధాన పాత్రలో కనిపిస్తాడని, థమన్ ఎస్ సంగీతం సమకూర్చనున్నారని వెల్లడించారు.
జాసన్ సంజయ్, లైకా ప్రొడక్షన్స్ మధ్య సహకారం మొదట 2023లో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించి ఏడాది అవుతున్నా విడుదలలో జాప్యాన్ని ఎదుర్కొంది. సుభాస్కరన్ సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా జాసన్ సంజయ్ 01 అని పేరు పెట్టారు. జాసన్ సంజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్ (2018-2020)లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను అభ్యసించాడు, ఆ తర్వాత 2020-2022 మధ్య లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో BA (ఆనర్స్) చదివాడు. జాసన్ పుల్ ది ట్రిగ్గర్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. సందీప్ కిషన్ చివరిసారిగా ధనుష్ హీరోగా నటించిన రాయన్ లో కనిపించాడు.