Leo: తలపతి విజయ్ సినిమా నుండి అంచనాలను పెంచేలా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దర్శక నిర్మాతలు సినిమా నుండి

By Bhavana Sharma  Published on  22 Jun 2023 2:00 PM IST
Thalapathy Vijay, New Movie Leo, first look poster, Kollywood

Leo: తలపతి విజయ్ సినిమా నుండి అంచనాలను పెంచేలా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 

తమిళ సినిమా ప్రేక్షకులు అందరికీ నటుడు విజయ్ దళపతి అంటే ఎంతో ఇష్టం. అసలు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో తమిళనాడులో తమ హీరో తరఫున ఎన్నో కార్యక్రమాలను చేయబడుతూ భారీ స్థాయిలో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్. 49 ఏళ్లు పూర్తి చేసుకొని ఈరోజు 50 హలో కి అడుగుపెడుతున్నారు విజయ్.

లోకేష్ కనకరాజు మరియు దళపతి విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో సినిమా నుండి హీరో యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ నువ్వు ఈరోజు దర్శకనిర్మాతలు విడుదల చేశారు. ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో, ఫ్యాన్స్ కు విజయ్ తరఫున గిఫ్ట్ ఇచ్చారు లియో సినిమా దర్శకుడు లోకేష్.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో చేతిలో గొడ్డలి, ఆ గొడ్డలి నుండి కారుతున్న రక్తపు చుక్కలను మనం చూడొచ్చు. ఈ పోస్టర్లు విజయ్ వెనకాల ఒక నక్కను కూడా మనం చూడొచ్చు. కొద్ది నెల క్రితం విడుదలైన సినిమా యొక్క టీజర్ వీడియో కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. ఆ వీడియో ద్వారా విజయ్ పాత్ర ఎంత వైలెంట్ గా ఉండబోతుందో ఫాన్స్ కు క్లారిటీ ఇచ్చేశారు లోకేష్. ఆ వీడియో కి తగ్గట్టుగా ఈరోజు విడుదలైన పోస్టర్, సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో వేగంగా జరుగుతోంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా ద్వారా విజయ్ తో చేతులు కలిపింది హీరోయిన్ త్రిష. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు డైరెక్టర్ లోకేష్ తీసిన సినిమాలకు మరియు లియోకు తప్పకుండా కలెక్షన్ ఉండబోతోంది. అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లియో సినిమా కూడా ఒక భాగమే.

లియో సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభు తో కలిసి సినిమాను చేయబోతున్నారు విజయ్. ఆ తరువాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story